రష్యా అధ్యక్షుడు పుతిన్ ను చంపేస్తే.. మిలియన్ డాలర్ల బహుమానం !

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఎనిమిదో రోజు కూడా రష్యా సేనలు ఉక్రెయిన్ పై భీకరంగా విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా ఖార్కీవ్, కీవ్ నగరాలపై రాకెట్లతో దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే ఈరోజు రెండో దశ చర్చలకు ఇరు దేశాలు సిద్ధం అయ్యాయి. బెలారస్ వేదికగా ఈ చర్చలు జరుగబోతున్నాయి. ప్రస్తుతం జరిగే ఈ చర్చలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచుస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రష్యాను వీడి అమెరికాలో ఆశ్రయం పొందుతున్న ప్రముఖ బిజినెస్ మ్యాన్.. కొనానిఖిన్ సంచలన ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను అరెస్టు చేసినా లేదా మర్డర్ చేసిన ఒక మిలియన్ డాలర్ల సొమ్మును బహుమానంగా ఇస్తానంటూ సైన్యానికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

తన ఫేస్బుక్ వేదికగా ఈ ప్రకటన చేయడం గమనార్హం. రష్యా దేశానికి చెందిన కోనా నిఖీన్ అమెరికాలోని పలు వ్యాపారాల్లో ఆరితేరాడు. పలు స్టార్ట్ అప్ లలో కూడా పెట్టుబడులు భారీగానే పెట్టాడు. క్రిప్టో ఇన్వెర్టర్ గా కూడా ఆయనకు మంచి రాబడి ఉంది. అతని సంపద విలువ 300 మిలియన్ డాలర్లు గా ఉంది. అయితే కొన్ని రాజకీయ అలాగే ఇతర కారణాల వల్ల రష్యా దేశాన్ని వదిలి అమెరికాలో… స్థిరపడి పోయాడు ఈ వ్యాపారవేత్త. అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ దేశంలో పరిస్థితులను చూసి ఇ ఆందోళన వ్యక్తం చేసిన కొనా నిఖిన్ తన సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ చేశాడు.

“పుతిన్ రష్యా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి స్వేచ్ఛాయుత ఎన్నికలు లేకుండా చేశాడు. తనను తాను జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. అన్యాయంగా విక్రయంపై యుద్ధాన్ని ప్రకటించి వేల మంది మరణానికి కారణమయ్యాడు. ఒక రష్యన్ పౌరుడిగా నా దేశాన్ని నానిజం నుంచి కాపాడే బాధ్యత ఉంది. అందుకే యుద్ధం నేరస్తుడిగా పుతిన్ ను అరెస్టు చేసినా లేదా చంపేసిన సైనికులకు ఒక మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తాను. అంతేకాదు తమ దేశం కోసం ప్రాణాలు నుండి పోరాడుతున్న పౌరులకు సంఘీభావం ప్రకటిస్తూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా 1992లో ఇతడు రష్యాను వదిలి… 1999 నుంచి అమెరికాలో స్థిరపడి పోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news