చేనేత మిత్ర సబ్సిడీ 6 నెలలుగా రాకపోవటంపై మంత్రి కేటీఆర్కు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేనేత మరియు అనుబంధ కార్మికులకు చేనేత మిత్ర పథకం కింద రావాల్సిన 40% సబ్సిడీ 6 నెలలు దాటినా రావటం లేద్నారు. దీంతో చేనేత కార్మికులకు ఇళ్లు గడవడం కూడా ఇబ్బందిగా మారిందన్నారు.