సొంత వారు అల్లం.. .బయటి వారు బెల్లమా..??: వైఎస్ షర్మిళ

-

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోకపోవడం పట్ల ఆమె ప్రశ్నించారు. సొంత వాళ్లు అల్లం.. బయటి వాళ్లు బెల్లమా అంటూ.. సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా.. ఆమె ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 

వైఎస్ షర్మిళ ట్విట్టర్ లో…  గాల్వన్ లో అమరులైన సైనిక కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వడం తప్పు కాదు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడంలో తప్పు లేదు. కానీ తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సాయం ఎందుకు చేయరు? 1200 మంది అమరులని ఉద్యమంలో గొంతుచించుకున్న మీకు… అధికారంలోకి వచ్చాక కొందరే అమరులెందుకయ్యారు?. నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకొంటున్న వందల మంది నిరుద్యోగులను ఎందుకు ఆదుకోరు? అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న వేలమంది రైతు కుటుంబాలను ఎందుకు ఆదుకోరు? కనీసం నష్టపోయిన పంటకు పరిహారం ఎందుకివ్వరు? సొంత రాష్ట్రం వారిని అల్లం,బయటి వారిని బెల్లం చేసుకోవడమేనా బంగారు భారత్ కు బాట? అంటూ వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Latest news