ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. పోలవరం ఖర్చు మొత్తం భరిస్తామని ప్రకటన కేంద్రం ప్రకటన చేసింది. ఇవాళ ఏపీలో పర్యటించిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ఖర్చులో ప్రతి ఒక్క రూపాయి కేంద్రమే భరిస్తుందని.. ఇదే విషయాన్ని సమావేశంలోనూ చెప్పానని వెల్లడించారు.
నేను రెండేళ్లు ముందే ఇక్కడకు రావాల్సిందని.. వచ్చి ఉంటే ప్రాజెక్టు పనులు ఇంకా వేగంగా జరిగి ఉండేవన్నారు. కరోనా కారణంగా రాలేకపోయానని.. దేశంలోనే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం… అయినా ఇంకా చాలా పని చేయాల్సి ఉందని వెల్లడించారు. ఏపీ బీజేపీ కార్యకర్తలకు ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉందని.. కరోనా సమయంలో ప్రపంచంలోనే తక్కువ ఖరీదు కరోనా వ్యాక్సిన్ మన దేశంలోనే తయారయ్యిందని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని.. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిందని స్పష్టం చేశారు. పునరావాస బాధితులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చూడటం మన బాధ్యత అని చెప్పారు. దీనికి బీజేపీ కార్యకర్తలు పని చేయాలని కోరారు గజేంద్రసింగ్ షెకావత్.