ఆంధ్రా నుండి మహరాష్ట్రకు గంజాయి రవాణాకు పాల్పడుతున్న ముఠాలోని ఏడుగురు నిందితులను టాస్క్ ఫోర్స్, ఆత్మకూర్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేయగా, ఒక నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వీరి నుండి పోలీసులు రూ.7లక్షల 65వేల విలువ గల 52 కిలోల గంజాయితో పాటు గంజాయి రవాణాకు వినియోగిస్తున్న ఒక కారు, ఆటో, ద్విచక్ర వాహనంతో పాటు 7 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.