వివేకా హత్య నిందితుల జాబితాలో జగన్ ను చేర్చాలి.. అసలు సూత్రదారి అతడే : యనమల

-

వివేకా హత్య నేరపూరిత కుట్ర, దీనిలో జగన్ ప్రధాన భాగస్వామి అని.. వివేకా హత్య నిందితుల జాబితాలో అవినాశ్ రెడ్డితో పాటు జగన్ పేరు కూడా చేర్చాలని డిమాండ్ చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల. రాజధానిపై మరో చట్టం తీసుకురావటానికి వీల్లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందని.. విభజన చట్టం ప్రకారం రాజధానిపై చట్టం చేసే హక్కు పార్లమెంటుకు ఉందిగానీ శాసనసభకు లేదని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారని చురకలు అంటించారు.

శాసన సభ రాజ్యాంగానికి లోబడి చట్టాలు చేయాలి తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టం చేసే అధికారం లేదని.. రాజధానిపై మూర్ఖంగా మరో చట్టం చేసినా ఇదే పరిస్ధితి ఎదురవుతుందని హెచ్చరించారు. ఇకనైనా హైకోర్టు తీర్పును, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి అమరావతిని అభివృద్ధి చేయాలని.. మూర్కపు వైఖరితో అమరావతిని నిర్లక్ష్యం చేస్తే హైకోర్టు తీర్పును కించపరిచినట్లే అవుతుందని తెలిపారు.

వైసీపీకి అధికార బలం, అహంకార మదం ఉంది తప్ప ఆలోచన బలం లేదని.. అభివృద్ది వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు కాదన్నారు. బడ్జెట్టును అన్ని ప్రాంతాలకు సమానంగా పంచి రాష్ట్రం అంతా అభివృద్ది చేయాలని.. అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మాట్లాడితే అభివృద్ది వికేంద్రకరణ అని కబుర్లు చెబుతున్నారని.. వైసీపీ 3 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ది చేశారో ఏఏ ప్రాంతంలో ఏ పరిశ్రమలు నెలకొల్పారో చెప్పాలని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news