కేంద్రం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడంలో ఆరితేరినందున ప్రధాని మోదీకి గ్లోబల్ అవార్డు ఇవ్వాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి డీసీఎంఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అన్ని సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ.. పెద్ద ఎత్తున ఉద్యోగాలను తొలగిస్తుందన్నారు. దీంతో ఎంతో మంది నిరుద్యోగులుగా మారుతున్నారని ఆయన విమర్శించారు.