మహాదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధానమైన లక్ష్మీ పంపుహౌస్ మోటార్లు నిలిచి, గోదావరి జలాల ఎత్తిపోతలు ఆగి నేటికి ఏడాది అవుతోంది. సంవత్సరం పాటు 17 బాహుబలి మోటార్లకు విశ్రాంతి దొరికింది. దీంతో గ్రావిటీ వెంట గోదావరి జలాల పరుగులు ఆగాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాల ప్రారంభోత్సవం అనంతరం దీర్ఘకాలం మోటార్లు నిలిచిపోవడం ఇదే తొలిసారిగా నమోదైంది