తాజాగా ఓ వివాదంలో కిషన్ రెడ్డి ఇరుక్కున్నారు. ఉక్రెయిన్ నుంచి భారత్ కు ఆపరేషన్ గంగలో భాగంగా చేరుకుంటున్న స్వదేశీ విద్యార్థులకు ఆహ్వానం పలికేందుకు ఎయిర్ పోర్టు దగ్గరకు వెళ్లి కిషన్ కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి.యుద్ధం ప్రకటించిన తరువాత కానీ భారత్ మేల్కోలేదన్న వాదనలో భాగంగా కిషన్ ఇక్కడికి చేరుకున్న విద్యార్థులను సాదరంగా పువ్వులు పట్టుకుని ఆహ్వానించినా పట్టించుకోవడం లేదు.దీనిపై రెండు వాదనలు ఉన్నాయి. రెండూ కూడా చూద్దాం ఓ సారి.కొందరేమో కిషన్ రెడ్డి తో సహా ఇతర భారత ప్రభుత్వ పెద్దలదే తప్పు అని ఇంకొందరు కాదు తప్పంతా విదేశాలకు తరలిపోయిన విద్యార్థులదేనని అంటున్నారు.
ముందుగా కిషన్ రెడ్డి తప్పు చేశారా లేదా అన్నది అటుంచితే ఈ దేశం తరఫున ఆపరేషన్ గంగలో భాగంగా చేపట్టిన ప్రణాళికలో భాగంగా స్వదేశీ విద్యార్థులను ఆహ్వానించడంలో ఎటువంటి తప్పూ లేదు. ఆయన సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించి పుష్పాలతో స్వాగతం పలుకుతుంటే చాలా మంది విద్యార్థులు దురుసుగా వెళ్లిపోతున్నారు.ఇది అస్సలు అంగీకరించదగ్గ విషయం కాదు. అవును భారత్ ఆలస్యంగా మేల్కొన్నా కూడా ఓ కేంద్ర మంత్రిని గౌరవించలేని స్థితిలో ఉన్నారా అన్నది ఓ వైపు వాదన.
మరోవైపు ఎంబసీ తరలించేందుకు భారత్ ఎంతగా ప్రయత్నించిందో అదేవిధంగా విద్యార్థుల తరలింపుపై శ్రద్ధ అయితే ఉంచలేదని వినిపిస్తోంది.అందుకే చాలా మంది కిషన్ రెడ్డి తో సహా ఏ ఇతర ప్రభుత్వ పెద్దల ఆహ్వానాన్నీ స్వీకరించలేదని అంటున్నారు. ఈ వాదన ఎలా ఉన్నా కూడా ఆపరేషన్ గంగ అన్నది యూపీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టినా సరే యుద్ధంలో ఇరుక్కున్న దేశం నుంచి ఈ దేశ పౌరులను రక్షించిన ఘనత కోసమే బీజేపీ సర్కారు ఆపసోపాలు పడినా కూడా ఇక్కడికి వచ్చిన విద్యార్థులు
కనీస మర్యాదను పాటించకపోవడం అన్నదే పెద్ద తప్పు.ప్రాణాలు దక్కించుకుని ఇక్కడికి వారు రావడమే పెద్ద విజయం. మళ్లీ ఇందులో అనవసర రాజకీయాలు, వాగ్వాదాలు, మాటల యుద్ధాలు ఎందుకని?