వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఈనెల 10న ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ పై నెలకొంది. తాజాగా విడుదలైన రిపబ్లిక్ పార్టీ ఎగ్జిట్ పోల్స్ లో యూపీలో మరోసారి బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కుండబద్ధలు కొట్టింది. మళ్లీ యోగీనే సీఎం అయ్యే అవకాశం ఉందని సర్వే తేల్చి చెప్పింది.
మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నా ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ పార్టీ 262-277 సీట్లు సాధిస్తుందని… సమాజ్ వాదీ పార్టీ 119-134 సీట్లు సాధిస్తుందని, బీఎస్పీ 7-15 స్థానాలు, కాంగ్రెస్ 3-8 స్థానాలు సాధించే అవకాశం ఉందని రిపబ్లిక్ సర్వే తేల్చింది. మరోవైపు ఉత్తరాఖండ్ లో బీజేపీ , కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ తప్పదని సర్వే తేల్చింది. 70 స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్ లో బీజేపీకీ 29-34 స్థానాల్లో, కాంగ్రెస్ 33-38 స్థానాలు గెలువ వచ్చని అంచానా వేసింది. ఇక పంజాబ్ లో ఆప్ దే అధికారం అంటూ సర్వే ఫలితాలు ఘోషిస్తున్నాయి. పంజాబ్ 117 స్థానాల్లో కాంగ్రెస్ 19-31, ఆప్ 76-90, బీజేపీ 1-4 స్థానాల్లో గెలుస్తాయని రిపబ్లిక్ టీవీ వెల్లడించింది.