పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పటాన్చెరుకు మంత్రి కేటీఆర్ రానున్నారని ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక జిఎమ్ఆర్ కన్వెన్షన్లో మహిళా దినోత్సవ వేడుకలపై అధికారులతో చర్చించి.. మహిళా దినోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు.