“తెలంగాణ నినాదం పాత చింతకాయ పచ్చడి” : స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు

-

భారతీయ జనతా పార్టీ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నినాదాన్ని అడ్డుపెట్టుకొని సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని… ఇక ఆ రాజకీయాలు అసలు నడువవని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమం అలాగే నినాదం పాత చింతకాయ పచ్చడి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు స్వామి గౌడ్.

తెలంగాణ లో బిజెపి పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. ఉద్యోగ ప్రకటనలతో నిరుద్యోగులు మోసపోవద్దని… మరో లక్ష ఉద్యోగాలు వచ్చే వరకు కేసీఆర్ను వదలబోమని హెచ్చరించారు. తెలంగాణ నినాదాన్ని అడ్డుపెట్టుకొని సీఎం కేసీఆర్ ఇక రాజకీయాలు చేయలేరని నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కేవలం బిజెపి పార్టీ మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని దాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు స్వామి గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news