ఇలా పెళ్లి చేసుకుంటే రూ.2.5 లక్షలు…. డైరెక్ట్ అకౌంట్ లోకే..!

-

పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో కూడా ఎంతో ముఖ్యమైనది. అయితే కొందరు పెద్దల కుదిర్చిన పెళ్ళిళ్ళను చేసుకుంటే మరి కొందరు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటూ వుంటారు. చాలా మంది వారి కులంలోని వారినే పెళ్లి చేసుకుంటే మరి కొందరు మాత్రం కులాంతర వివాహం చేసుకుంటారు. అయితే ఇలా పెళ్లి చేసుకునే వారు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆర్థిక సాయం పొందొచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఈ స్కీమ్ పేరు డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ సోషల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. ఎవరైనా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే తొలి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు పడకుండా వుంటారు. వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఈ స్కీమ్ ఆర్థిక సాయం ఇస్తుంది.

ఇక ఈ స్కీమ్ కి ఎవరు అర్హులు అన్నది చూస్తే.. పెళ్లి చేసుకునే వారిలో ఒకరు షెడ్యూల్డ్ క్యాస్ట్‌కు మరొకరు నాన్ షెడ్యూల్డ్ క్యాస్ట్‌కు చెందిన వారు అవ్వాలి. హిందూ వివాహ చట్టం 1955 కింద వీరి పెళ్లి నమోదు చెయ్యాలి. హిందూ వివాహ చట్టం కింద కాకుండా ఇతర విధానంలో పెళ్లి చేసుకున్న వారు ప్రత్యేకమైన సర్టిఫికెట్‌ను సబ్మిట్ చెయ్యాలి.

మొదటి సారి కులాంతర విహహం చేసుకున్న వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. కానీ రెండో పెళ్లి, మూడో పెళ్లికి ఇది వర్తించదు. పెళ్లి చేసుకున్న ఏడాదిలోపే ఈ స్కీమ్ కింద ఆర్థిక సాయం పొందటానికి దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్ క్యాస్ పెళ్లి చేసుకున్న వారికి మొత్తంగా రూ.2.5 లక్షల దాకా ఇస్తారు.

ఇది ఇలా ఉంటే ఆన్‌లైన్ ద్వారా బ్యాంక్ అకౌంట్‌లో రూ.1.5 లక్షల మొత్తాన్ని పొందొచ్చు. మిగిలిన మొత్తాన్ని ఫౌండేషన్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. ఈ పథకాన్ని రెండేళ్ల కాల వ్యవధిలో పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news