మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తగ్గేదేలే.. రెడ్ బుక్ లోని మూడో చాప్టర్ తెరవబోతున్నా అంటూ మంత్రి నారా లోకేష్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయి. త్వరలో మూడో చాప్టర్ మొదలుకాబోతోందని వైసీపీ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్కరికీ చట్టపరమైన ట్రీట్మెంట్ ఉంటుందని తెలిపారు.
రెడ్ బుక్ లోని మూడో చాప్టర్ తెరవబోతున్నా అంటూ పుష్పా రేంజ్ లో మంత్రి లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.
టీడీపీ ఎన్నారైలకు పాదాభివందనం తెలిపారు మంత్రి నారా లోకేష్. ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా పార్టీ కోసం కష్టపడ్డారని… సూపర్ సిక్స్ హామీలను పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నామన్నారు. గతంలో ఓ సైకో వెయ్యి పింఛను పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకున్నాడని… మేము అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే వెయ్యి పింఛను పెంచామని వివరించారు. అభివృద్ధి, సంక్షేమం టీడీపీకి జోడెద్దుల బండి అన్నారు.