నార్కట్పల్లి: రైతులు వరి వేసుకునే హక్కును కేసీఆర్ కాలా రాశాడని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానం యాత్ర నార్కట్ పల్లి మండలంలో ప్రారంభించిన షర్మిల మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక విధానాలను కేసీఆర్ అమలు చేస్తున్నారని రైతులు కేసీఆర్ కు బుద్ధి చెప్పాలన్నారు. ఒక లక్షా 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు.