గతం లో వైట్ ఓన్లీ అండర్ వేర్ పాలసీ గురించి మనం చూశాం. అయితే ఇప్పుడు జపాన్ లో పోనీ టైల్ హెయిర్ స్టైల్ కి సంబంధించి ఒక వార్త వచ్చింది. జపాన్ లో ఆడ పిల్లలు పోనీ టైల్ వేసుకోవడాన్ని నిషేధించారు. స్కూల్ కి పోనీ టైల్ వేసుకుని ఆడపిల్లలు రాకూడదని తెలిపారు.
ఇలా పోనీ టైల్ వేసుకోవడం వల్ల మెడ భాగం కనబడుతుందని దీని వల్ల స్కూల్స్, కాలేజీలలో ఉండే మగ వారికి సెక్సువల్ ఎగ్జైట్మెంట్ కలుగుతుందని తెలిపారు. 2020లో ఒక సర్వే ని కండక్ట్ చేశారు. ప్రతి పది స్కూళ్లలో ఒక స్కూల్ ఈ హెయిర్ స్టైల్ వలన ఇలాంటి ఇబ్బంది ఉంటుందని తెలిపింది. ఆడపిల్లలను మగపిల్లలు చూస్తారని ఇబ్బందులు వస్తాయని విద్యాసంస్థలు తెలుపుతున్నాయి.
గతం లో వైట్ ఓన్లీ అండర్వేర్ గురించి చూస్తే.. జపాన్ లో ఉండే పాఠశాలలో కేవలం తెలుపు రంగు అండర్ వేర్ ని మాత్రమే ధరించాలని.. అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. లేస్ అండర్ వేర్లు వంటివి ధరించకూడదు. పాఠశాలలకి పిల్లలు అలాంటివి ధరించకూడదు అని ఆ పాఠశాలల్లో నిషేధించారు. అందుకని ఇలా రూల్స్ ని మార్చడం జరిగింది. ఇప్పుడు పోనీ టైల్ గురించి కూడా పాఠశాలలు నిర్ణయం తీసుకున్నాయి.