ఏపీ రాజధాని అమరావతి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మూడు రాజధానుల పేరుతో జగన్ సర్కార్ అమరావతిని వదలేసింది. దీంతో ఏపీలో దాదాపు ఏడాదిన్నర నుంచి సందిగ్ధత నెలకొంది. అయితే… నిన్న ఏపీ ప్రభుత్వం…. 2022-23 బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే… ఈ బడ్జెట్ లో…రాజధాని అలాగే.. అమరావతి రైతుల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేసింది సర్కార్.
రాజధాని నిర్మాణం సహా వివిధ అవసరాల నిమిత్తం బడ్జెట్టులో రూ. 1329.21 కోట్ల కేటాయింపులు చేసింది.కేంద్ర నిధులు రూ. 800 కోట్లతో రాజధాని నిర్మాణ పనులు చేపడతాని బడ్జెట్టులో పేర్కొంది జగన్ సర్కార్. రాజధాని గ్రామాల్లోని పేదల కోసం క్యాపిటల్ రీజియన్ సోషల్ సెక్యూర్టీ ఫండ్ నిమిత్తం రూ. 121.11 కోట్ల కేటాయింపు చేయగా.. రాజధాని రైతులకిచ్చే కౌలు చెల్లింపుల కోసం రూ. 208 కోట్ల కేటాయింపులు చేసింది. రాజధాని గ్రామాల్లో గ్రీనరీ, ఎల్ఈడీ బల్బుల నిర్వహాణ, శానిటేషన్, కరకట్ట విస్తరణకు అవసరమైన భూ సేకరణ నిమిత్తం రూ. 200 కోట్లు బడ్జెట్టులో కేటాయించింది ప్రభుత్వం. కాగా..అమరావతి రైతులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని.. ఏపీ హై కోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే.