డ్వాక్రా మ‌హిళ‌ల‌కు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త

-

తెలంగాన రాష్ట్ర మహిళలకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు త్వ‌ర‌లోనే అభ‌య హ‌స్తం నిధులు తిరిగి ఇచ్చేందుకు కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో కొద్ది రోజుల్లోనే మ‌హిళ‌ల ఖాతాల్లోకి జ‌మ‌ కానున్నాయి. సీఎం కేసీఆర్‌ అదేశాల మేరకు అసెంబ్లీలో స‌మావేశ‌మైన మంత్రులు హ‌రీశ్ రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, మ‌ల్లారెడ్డిలు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలోని డ్వాక్రా మ‌హిళ‌లు పొదుపు చేసుకున్న అభ‌య హ‌స్తం నిధుల‌ను ఆ మ‌హిళ‌ల‌కు తిరిగి ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్ష‌ల మంది డ్వాక్రా సంఘాల మ‌హిళ‌లు రూ.545 కోట్ల రూపాయ‌ల‌ను పొదుపు చేసుకున్నారు. అప్పట్లో అభయ హస్తం కింద రూ.500 కంట్రిబ్యూటరీ పెన్షన్ కోసం ఈ పొదుపు జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, ఆసరా పథకం కింద మొదట్లో వెయ్యి రూపాయలు, ఇప్పుడు రూ.2016 మొత్తాన్ని పెన్షన్ గా ఇస్తున్నది.

అప్పటి కంటే ఇప్పుడు అధిక మొత్తంలో పెన్షన్ వస్తున్నందున మహిళలు సైతం అభయ హస్తం డబ్బులు తమవి తమకు కావాలని అడుగుతున్నారు. పొదుపు మహిళల కోరిక మేరకు ఆ నిధులను వారికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిధులు సంబంధిత పేదరిక నిర్మూలన సంస్థ వద్దే ఉన్నాయి. ఇక ప్రభుత్వం నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news