ఆయనేమీ చాలామంది అభ్యర్థుల్లా కోటీశ్వరుడు కాదు… లక్షాధికారి అంతకన్నా కాదు.. చివరకు వేలాధికారి కూడా కాదు అంటే మీరు నమ్ముతారా?
ప్రస్తుతం దేశమంతా లోక్ సభ ఎన్నికల గురించే చర్చ. ఎన్నికల పోటీ చేసే అభ్యర్థులకు ఎంత ఆస్తి ఉంది. ఎవరికి ఎక్కువ ఆస్తి ఉంది. ఎవరికి తక్కువ ఆస్తి ఉంది. ఎవరి బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఎవరు సెలబ్రిటీలు.. ఎవరు గెలుస్తారు.. ఎవరు గెలవరు.. ఇవే కదా ఆసక్తికరం. అయితే.. వీటన్నింటిలో ఒక అభ్యర్థి మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాడు. అందుకే ఆయన్ను ఇప్పుడు మీకు పరిచయం చేసేది. ఆయనేమీ చాలామంది అభ్యర్థుల్లా కోటీశ్వరుడు కాదు… లక్షాధికారి అంతకన్నా కాదు.. చివరకు వేలాధికారి కూడా కాదు అంటే మీరు నమ్ముతారా? ఆయన పేరే మంగెరామ్ కశ్యప్. యూపీలోని ముజప్ఫర్ నగర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.
కాకపోతే… ఆయన అత్యంత పేద అభ్యర్థి. ఆయన అకౌంట్ లో భూతద్దం పెట్టి వెతికినా ఒక్క పైసా కూడా కనిపించదు. ఆయన అకౌంట్ లో లేకపోతే ఆయనకు బినామీలు ఉండొచ్చు కదా.. అంటారా? ఆయనకు బినామీలా? ఆయన భార్య అకౌంట్ లోనూ ఒక్క రూపాయి ఉండదు. ఆయన ఇప్పుడే పోటీ చేయడం లేదు. 2000 సంవత్సరం నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. పోటీ చేస్తున్నప్పుడల్లా… మరింత పేదవాడిగా మారిపోతున్నాడు.ఇంతకీ ఆయన వృత్తి ఏంటో అంటారా? ఆయన న్యాయవాది. వయసు 51 ఏళ్లు. సొంతంగా మజ్దూర్ కిసాన్ యూనియన్ పార్టీని స్థాపించాడు. అప్పటి నుంచి తన పార్టీ తరుపున ఒక్కడే పోటీ చేస్తాడు. ఇప్పటి వరకు తన పార్టీలో వెయ్యి మంది సభ్యులు ఉన్నారట. కాకపోతే వారంతా కూలీలేనట. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే మంగేరామ్.. నామినేషన్ దాఖలు చేసిన సమయంలో తన దగ్గర రూపాయి లేదని అఫిడవిట్ సమర్పించాడు.
కాకపోతే వాళ్లు ఉండటానికి ఒక ఇల్లు. ఒక చిన్న ప్లాట్ అంతే.. అవే వాళ్ల ఆస్తి. ఆ ఇల్లు కూడా అత్తగారు కట్నం కింద ఇచ్చారట. ఎన్నికల ప్రచారం కోసం ఆయన దగ్గర ఒక బైక్ ఉంది. అంతే.. ఇంత మంది కోటీశ్వరులైన అభ్యర్థుల మధ్యలో రూపాయి కూడా లేని అభ్యర్థి.. వావ్ సూపర్ కదా…