బాలకృష్ణకు మెంటల్.. డాక్టర్ సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలయ్యకు మెంటల్ ఉందని ట్వీట్ చేశారు.

ఏపీలో రాజకీయాలు మామూలుగా లేవు. రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు మాటలతో యుద్ధాలే చేస్తున్నారు. ఇదివరకు మైకుల ముందు ఒకరిని మరొకరు తిట్టిపోసేవారు. కానీ.. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కదా.. ఏదైనా సోషల్ మీడియాలోనే. తిట్టాలనుకుంటే తిట్టడం… ఏదైనా క్షణాల్లో సోషల్ మీడియాలో జరిగిపోతోంది. ప్రత్యర్థులను మెసలకుండా ట్వీట్ల మీద ట్వీట్లు.. పోస్టుల మీద పోస్టులు చేసి ఓట్లు రాబట్టుకోవడానికి ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు.

YCP MP Vijayasai reddy sensational comments on balakrishna

అయితే… తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలయ్యకు మెంటల్ ఉందని ట్వీట్ చేశారు.తన ఇంట్లో బెల్లంకొండ సురేశ్ ను రివాల్వర్ తో కాల్చిన కేసులో బాలకృష్ణ జైలుకు పోకుండా అప్పటి నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు చౌదరి ఆయనకు మెంటల్ ఉందని సర్టిఫికెట్ ఇచ్చాడు. బెయిల్ దొరికిందాక రెండు నెలలు కరెంట్ షాకులిచ్చారు. వ్యాధి ఇంకా నయం కానట్టుంది.. కార్యకర్తల్ని కొడుతున్నాడు.. అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.



ఇక నెటిజన్లు ఊరుకుంటారా? అవును.. బాలకృష్ణకు మెంటల్ ఉంది నిజమే. ఆయనకు మెంటల్ ఉందని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇదే అంటూ దాన్ని షేర్ చేయడం.. ఆయనకు మెంటల్ ఉన్నట్టుగా వార్తలు రాసిన పేపర్ క్లిప్పింగ్స్ ను కూడా ట్విట్టర్ షేర్ చేస్తూ.. విజయసాయిరెడ్డి ట్వీట్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news