గంగాధర మండలం రంగరావుపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు వరద కాలువలో పడి ఇద్దరు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం చేరుకున్నారు. అధికారులతో ఫోనులో మాట్లాడి గల్లంతైన వారిని రక్షించాలని సూచించారు. పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.