రాజకీయాల్లో రియల్‌ హీరో జగనే..వెంట్రుక కూడా పీకలేరు : పవన్‌ కు వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్‌

-

పవన్ కళ్యాణ్ విమర్శలపై కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి. నిన్నటి ఆవిర్భావ సభ పార్టీ ప్రమోషన్ కోసం చేసినట్లు లేదని.. పార్టీకి రేటు పెంచుకునేందుకు పెట్టిన సభ అని ఆయన చురకలు అంటించారు. నువ్వు సినిమాల్లో హీరో కావచ్చు కానీ… రాజకీయాల్లో రియల్ హీరో జగన్ అని పేర్కొన్నారు. కొంత మంది నాయకులు అమాయకంగా జనసేనలో చేరుతున్నారని.. వారందరినీ పొత్తుల ద్వారా ముంచనున్నాడని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్ సింగిల్‌గా పోటీ చేయాలని.. నాకు ఇంత మంది బలం ఉంది…ఎంత ఇస్తారు అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ నా పై వ్యక్తిగత విమర్శలు చేశారని..పబ్లిక్‌గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నేను అంత శాంతపరుడిని కాదని.. టీడీపీ, బీజేపీ చంక ఎక్కటం మానుకోవాలని పవన్‌ కు చురకలు అంటించారు. నా జోలికి వస్తే ఎవరినీ క్షమించనని.. జనసేన కార్యకర్తలు మా ఇంటి పై దాడి చేయటం వల్లే మా వాళ్ళు ప్రతి దాడి చేశారన్నారు. కాకినాడలో నా వెంట్రుక కూడా పీకే వారు లేరని సవాల్‌ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news