జనసేన ప్రచారంలో నిహారిక..!

-

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడమే కాదు మెగా హీరోలు కూడా ముందుకు రాని రాజకీయ ప్రచారాలకు సైతం ఆమె చేస్తుంది. బాబాయ్ జనసేనకు తన సపోర్ట్ ఉంటుందని చెప్పిన నిహారిక తన తండ్రి నర్సాపురం నుండి లోక్ సభకు పోటీ చేస్తుండగా మంగళవారం సాయంత్రం అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాగబాబుతో నిహారిక కూడా ప్రచారంలో పాల్గొనడం విశేషం.

ఇక ఈమధ్య సూర్యకాంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిహారిక ఆ సినిమాతో మరో ఫెయిల్యూర్ ను తన ఖాతాలో వేసుకుంది. నిహారిక ఇక సినిమాలకు గుడ్ బై చెబుతుందనే అంటున్నారు. పొలిటికల్ ప్రచారాల్లో పాల్గొనాలంటే హీరోలు సైతం జంకుతారు కాని జనసేన కోసం నిహారిక డేరింగ్ స్టెప్ తీసుకుంది. సినిమాల్లో సక్సెస్ కాకున్నా నిహారిక ఫ్యూచర్లో రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందేమో అని అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news