హెరిటేజ్ కంపెనీ నాది.. తెల్ల కాగితాలపై బాబు సంతకాలు పెట్టించుకొని కొట్టేశారు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు!

-

ఎన్టీఆర్ ను మోసం చేసి టీడీపీని లాక్కున్నట్టే… తనను మోసం చేసి హెరిటేజ్ ఫుడ్స్ లాక్కున్నారని మోహన్ బాబు ఈసందర్భంగా వెల్లడించారు.

ఓమైగాడ్.. అసలు ఏపీలో ఏం జరుగుతోంది. ఇవేం రాజకీయాలురా బాబోయ్. ఇంతలా వేడెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ చంద్రబాబు బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడటమే కాదు.. టీడీపీకి చెందిన ముఖ్య నేతలు కూడా టీడీపీని వీడిపోతున్నారు. దీంతో రోజురోజుకూ టీడీపీ బలం తగ్గుతూ వస్తోంది.

Mohan babu shocking comments on ap cm chandrababu

ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన నటుడు మోహన్ బాబు.. తాజాగా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుది కరివేపాకు పాలసీ అని.. యూజ్ అండ్ త్రోనే ఆయన క్యారెక్టర్ అన్నారు.

ఒక్క ఎన్టీఆర్ నే కాదు.. ఆయన్ను నమ్ముకున్న చాలామందిని చంద్రబాబును మోసం చేశారని ధ్వజమెత్తారు. చివరకు తనను కూడా చంద్రబాబు దారుణంగా మోసం చేశారని వెల్లడించారు మోహన్ బాబు.

అసలు.. హెరిటేజ్ ఫుడ్స్ తనదని.. కానీ.. దాన్ని దొంగతనంగా చంద్రబాబు లాక్కున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కంపెనీని తాను, చంద్రబాబు, దాగా అనే ఇంకో స్నేహితుడు ముగ్గురం కలిసి స్థాపించామన్నారు. అందులో ఎక్కువ పెట్టుబడి తనదేనని… చంద్రబాబుది, దాగా అనే వ్యక్తులది చాలా తక్కువ పెట్టుబడి అన్నారు.

హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీని స్థాపించిన కొన్ని సంవత్సరాల తర్వాత చంద్రబాబు తెల్ల కాగితాల మీద తన సంతకం పెట్టించుకున్నారు. ఎందుకు సంతకం అని అడిగితే.. తనను డైవర్ట్ చేసి ఏదో చెప్పారని.. దీంతో చంద్రబాబును గుడ్డిగా నమ్మి తాను సంతకం పెట్టానని మోహన్ బాబు తెలిపారు. తర్వాత మరికొన్ని పేపర్ల మీద కూడా సంతకాలు తీసుకున్నారని.. కొన్ని రోజుల తర్వాత హెరిటేజ్ సంస్థ తనదేనని చంద్రబాబు చెప్పారని.. దీంతో తాను షాక్ తిన్నానని వెల్లడించారు.

అలా ఎలా అవుతుది.. ఎక్కువ పెట్టుబడి పెట్టింది తాను అని.. కోర్టుకు వెళ్లానని.. అయితే ఆ కేసు చాలా కాలం సాగందని.. అయితే చంద్రబాబుకు అప్పట్లో అందరితో మంచి సంబంధాలు ఉండేవని. దీంతో ఆయనతో మనం పెట్టుకోలేమని.. ఆ కేసు వదిలేసుకోవాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పడంతో తాను హెరిటేజ్ ఫుడ్స్ ను వదులకున్నానని మోహన్ బాబు గుర్తు చేశారు.

ఎన్టీఆర్ ను మోసం చేసి టీడీపీని లాక్కున్నట్టే… తనను మోసం చేసి హెరిటేజ్ ఫుడ్స్ లాక్కున్నారని మోహన్ బాబు ఈసందర్భంగా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news