బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. హాలీవుడ్ లో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు రావడంతో వరుసగా అవకాశాలు కూడా వస్తున్నాయి. దీంతో ఈ అమ్మడు.. బాలీవుడ్ విడిచి పెట్టి హాలీవుడ్ లోనే స్థిరపడుతుంది. అలాగే అక్కడే నిక్ జోనస్ అనే అమెరికన్ సింగర్ ను వివాహం చేసుకున్న ప్రియాంక చోప్రా.. దాదాపు అమెరికాలోనే సెటిల్ అయింది. కాగ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ కు వెళ్లక ముందు ముంబైలో ఇల్లుతో పాటు ఆస్తులు ఉన్నాయి.
అలాగే ప్రియాంక చోప్రా ఎంత ఇష్ట పడి కొనుకున్న రోల్స్ రాయల్స్ ఘోస్ట్ కారు కూడా ముంబైలోనే ఉంది. కాగ ప్రియాకం చోప్రా.. హాలీవుడ్ కు మకాం మార్చిన తర్వాత.. తనకు ఇష్టమైన రోల్స్ రాయల్స్ ఘోస్ట్ కారు కూడా ఇక్కడే ఉంది. ఈ కారును ప్రియాంక చోప్రా ఇంతో ఇష్ట పడి రూ. 2.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. బాలీవుడ్ లో రోల్స్ రాయల్స్ కారు కొన్నది ప్రియాంక చోప్రానే.
ఆమె తర్వాతే.. మిగిత బాలీవుడ్ స్టార్స్ రోల్స్ రాయల్స్ కారును కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు ఈ కారును అమెరికాకు తీసుకెళ్లడంలో ఈ భామ్మ తీవ్ర ఇబ్బందులు పడుతుందట. దీంతో చేసేది ఏమీ లేకా… తనకు బాగా ఇష్టమైన ఈ కారును అమ్మెసిందని సమాచారం. ఈ కారును బెంగళూర్ కు చెందిన ఒక ప్రముఖ వ్యాపార వేత్త కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.