తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి.జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయం నుంచి కేసీఆర్ కాస్త బయటపడ్డారనే చెప్పవచ్చు.వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండనున్నారు అని కూడా తేలిపోయింది.అంటే ఇకపై ఆయన ఢిల్లీ రాజకీయాలపై పెద్దగా మునుపు ఉన్నంతగా ఫోకస్ చేయరు అనే సమాచారం కూడా ఉంది. ఎవరి వర్ణన ఎలా ఉన్నా ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కూడా పార్టీలో మార్పులకు కేసీఆర్ శ్రీకారం దిద్దడం ఖాయం. అంతేకాకుండా చాలా సిట్టింగ్ స్థానాలను మార్చనున్నారు. ప్రశాంత్ కిశోర్ సలహాలూ సూచనలూ తూచ తప్పక పాటించనున్నారు.
ఇక రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ తన నియోజకవర్గంను కూడా మార్చుకోనున్నారు.ఇప్పటిదాకా గజ్వేల్ నియోజక వర్గం నుంచి పోటీచేసిన కేసీఆర్ ఇకపై మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు అని తెలుస్తోంది.ఈ మేరకు ప్రధాన మీడియాల్లో కథనాలు కూడా వస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారు.ఈ మేరకు ఆ జిల్లా నాయకులతో ఇప్పటికే ఆయన ముచ్చటించారు.సాధ్య సాధ్యాలు పరిశీలించారు. దక్షిణ తెలంగాణలో పార్టీ బలోపేతమే ధ్యేయంగా పనిచేయాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోందని ప్రధాన మీడియా చెబుతోంది.ఆ విధంగా వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే నియోజకవర్గ మార్పు అన్నది తథ్యంగానే ఉంది.
కేసీఆర్ మునుగోడు నుంచి పోటీ చేయడం మంచిదేనా?#CMKCR #Telangana @trspartyonline
— Manalokam (@manalokamsocial) March 20, 2022