తాను ప్రెగ్నెంట్ అని వెల్లడించిన స్టార్ హీరోయిన్.

-

పెళ్లి చేసుకుంటున్న హీరోయిన్లు ఒక్కొక్కరుగా తమ బిడ్డలకు జన్మనివ్వబోతున్నారు. ఇటీవల కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది. తాజాగా మరో స్టార్ హీరోయిన్ తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని వెల్లడించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ తాను ప్రెగ్నెంట్ గా ఉన్న విషయాన్ని వెల్లడించింది. భర్త ఆనంద్ అహుజాతో కలిసి దిగిన బేబి బంప్ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 

బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కుమార్తె అయిన సోనమ్ కపూర్ 2018లో బిజినెస్ మ్యాన్ ఆనంద్ అహుజాను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో నటించింది లేదు. 2007లో ‘సావరియా’ సినిమాతో బాలీవుడ్ కు తెరంగ్రేటం చేసింది సోనమ్ కపూర్. ఇదే సినిమాతో రణ్ బీర్ కపూర్ కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ఢిల్లీ-6, రాంజానా, బాగ్ మిల్కా బాగ్, ప్రేమ్ రతన్ థన్ పాయో, నీర్జా, పాడ్ మ్యాన్, సంజూ సినిమాల్లో నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news