నాగ చైతన్య, సమంత ‘మజిలీ’ రివ్యూ & రేటింగ్

-

అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన సినిమా మజిలి. శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈరోజు రిలీజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

పూర్ణ (నాగ చైతన్య) క్రికెట్ ను కెరియర్ గా.. అన్షు (దివ్యాన్ష కౌశిక్)ను ప్రేమను గెలిపించుకోవాలని అనుకుంటాడు. కాని అతనికి రెండూ దూరమవుతాయి. ఈ క్రమంలో పూర్ణకి శ్రావణి (సమంత)తో పెళ్లి అవుతుంది. శ్రావణి అంటే ఏమాత్రం ఇష్టం లేని పూర్ణ ఆమెను ఎప్పుడూ తిడుతూ ఆమె చెప్పిన దాన్ని వినకుండా ఉంటాడు. పూర్ణని ఎలాగైనా మాములు మనిషి చేయాలని శ్రావణి ప్రయత్నిస్తుంది. ఫైనల్ గా పూర్ణ శ్రావణి ఎలా దగ్గరయ్యారు అన్నది సినిమా కథ.

ఎలా ఉందంటే :

నిన్నుకోరి సినిమాతో కొత్త కథతో తెలుగు ప్రేక్షకులను అలరించిన దర్శకుడు శివ నిర్వాణ రెండో ప్రయత్నంగా కూడా మరో ఎమోషనల్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు. పూర్ణ, అన్షు, శ్రావణిల జీవిత కథ నేటి తరం యువతకు పర్ఫెక్ట్ గా సూటయ్యే కథ. ఈ కథను దర్శకుడు హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. సినిమా మొదటి భాగం మొత్తం ఎమోషనల్ జర్నీగా సాగుతుంది.

సెకండ్ హాఫ్ కాస్త భారీ డైలాగ్స్ కొద్దిగా ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. సినిమా రెండున్నర గంటలకు తక్కువ రన్ టైం ఉండటంతో ఓకే అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో సినిమాటిక్ లిబర్టీస్ కు తావివ్వడంతో అప్పటిదాకా ఉన్న రియలిస్టిక్ ఫీలింగ్ పోతుంది. నాగ చైతన్య, సమంత పూర్ణ పాత్రలకు ప్రాణం పోశారు.

సినిమా అంతా మనసుకి హత్తుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. చైతు, సాం ల పర్ఫార్మెన్స్ అక్కినేని ఫ్యాన్స్ కే కాదు సగటు సిని ప్రేక్షకులను మెప్పిస్తుంది.

ఎలా చేశారు :

నాగ చైతన్య ఈ సినిమాలో కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. పూర్ణ పాత్రలో తనని తాను మార్చుకున్న తీరు బాగుంది. శ్రావణిగా సమంత చితక్కొట్టేసింది. సమంత మరోసారి తన అభినయంతో మెప్పించిందని చెప్పొచ్చు. రియల్ లైఫ్ లో భార్యాభర్తలెన చైతు, సమంత ఇలా రీల్ లైఫ్ లో ఫీల్ గుడ్ మూవీలో నటించడం అందంగా ఉంటుంది. మరో హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్ కూడా బాగా చేసింది. రావు రమేష్, పోసాని కృష్ణ మురళిల పాత్రలు అలరించాయి. సుబ్బరాజు పాత్ర అలరిస్తుంది.

టెక్నికల్ టీం విషయాన్నికి వస్తే.. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. గోపి సుందర్ మ్యూజిక్ అలరించగా తమన్ బిజిఎం సినిమాకు ప్లస్ అయ్యింది. శివ నిర్వాణ కథ, కథనాల్లో తన పర్ఫెక్షన్ చూపించాడు. రాసుకున్న కథకు పూర్తి న్యాయం చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

నాగ చైతన్య, సమంత

సినిమాటోగ్రఫీ

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ స్లో అవడం

బాటం లైన్ :

మజిలీ.. లవ్ అండ్ ఎమోషనల్ జర్నీ..!

రేటింగ్ : 3/5

Read more RELATED
Recommended to you

Latest news