శ్రీ వికారినామ సంవత్సరం కర్కాటకరాశి రాశిఫలాలు
పునర్వసు 4వ పాదం, పుష్యమి 1,2,3,4 పాదాలు
అశ్లేష 1, 2,3,4 పాదాలు
ఆదాయం -5 వ్యయం -5
రాజపూజ్యం -5 అవమానం-2
గురువు- ఉగాది నుంచి ఏప్రిల్ 22 వరకు, నవంబర్ 4 తర్వాత ధనస్సులో షష్టమస్థానంలో ఉంటాడు. నవంబర్ 4 వరకు వృశ్చికంలో ఉంటాడు. షష్టమంలో ఉన్నప్పుడు కృషిశీలతను పెంపొందిస్తాడు. వృత్తిస్థానంలో ఇతరులకు అవసరమైన కార్యక్రమాలను సక్రమంగా నెరవేర్చడం వల్ల కీర్తిప్రతిష్టలు పెంచుకుంటారు. శని ఉగాది నుంచి జనవరి 24 వరకు ధనస్సులో అంటే షష్టమంలో ఉంటాడు. దీనివల్ల పనుల్లో విజయం, శత్రువులను పట్టించుకోకుండా మీ పనులను మీరు చేసుకుని విజయం సాధిస్తారు. రాహు సంచారం మిథునంలో అంటే వ్యయస్థానంలో ఉంది. దీనితో మీరు పుణ్యకార్యాలను చేయడానికి ఆసక్తి చూపిస్తారు. నిలకడలేని స్వభావం ఉంటుంది. కేతువు ధనస్సులో ఉండటం వల్ల ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.

గ్రహసంచారాలను పరిశీలించగా.. ఈ రాశివారికి యోగకాలమనే చెప్పుకోవచ్చు. కొత్త కార్యాలను ప్రారంభించి పూర్తిచేస్తారు. కుటుంబంలో ఆర్థికస్థితి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. సంతానం వల్ల చికాకులు. కోర్టు, విదేశీ వ్యవహారాలు త్వరితగతిన పరిష్కారం అవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారంతో పనులు పూర్తి, చేసేపనిలో ఉన్నతాధికారుల అభిమానాన్ని పొందుతారు, ఆకస్మిక వాహన ప్రమాద సూచన ఉంది జాగ్రత్త. వ్యవసాయదారులకు రెండు పంటలు కలిసి వస్తాయి. విద్యార్థులకు ఉన్నతవిద్య, విదేశీ అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు, ఫైనాన్స్ రంగంలోవారికి అనుకూలం. వ్యాపారస్తులకు విశేష ఆదాయం. సినీరంగం, కళాకారులకు ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు ఇతర ప్రదేశాల్లో మంచిపేరు వస్తుంది. కంప్యూటర్ రంగంలో వారికి అంత అనుకూలం కాదు. రాజకీయ రంగంలోవారికి ఉన్నత పదవులు వస్తాయి. ఈరాశి స్త్రీలకు విశేష పరిశ్రమ చేసి ప్రభుత్వం నుంచి గుర్తింపు, అవార్డులు పొందుతారు. ఈరాశివారు ఆంజనేయస్వామి పూజ, పారాయణం, ప్రదక్షిణలు, సింధూర ధారణ చేయడం వల్ల విశేష ఫలితాలు పొందుతారు.
చైత్రమాసంలో సమయానికి రావలసిన డబ్బు అందుతుంది. చేయవలసిన పనులు సకాలంలో నిర్వర్తిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్త, ఆలోచన ప్రధానంగా అవసరం. అనుభవజ్ఞుల సహాయ సహ-కారాలు సమయానికి అందక పోవడంతో కొన్ని పనులు వాయిదా పడడము ఉంటుంది. వైశాఖమా-సంలో మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. బంధువులు, ఆత్మీయులలో గుర్తింపును పొందుతారు. ఉద్యోగము, స్వయంవృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. జ్యేష్ట మాసంలో మొదటి రెండు వార-ములు అనుకూలంగా ఉండి, తర్వాత ప్రతికూలత చోటు చేసుకుంటుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. వ్యవహారాలు సజావుగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరము. ఆషాఢంలో ప్రారంభించిన పనులు అన్నీ ఆలస్యంగా ముందుకు సాగుతాయి. విద్యార్థులు చదువులో కొన్ని మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. శ్రావణ మాసంలో ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంట్లో భార్యాపిల్లలతో అనుకూల వాతావరణం ఉంటుంది. వస్తువులను, ఆస్తులను కొనే అవకాశం కూడా గోచరిస్తుంది. భాద్రపదంలో ప్రారంభించిన పనులు శ్రద్ధతో బాధ్యతగా నిర్వర్తించ-డంతో మంచి ఫలితాలను పొందుతారు. ఖర్చులకు తగిన ఆదాయము ఉంటుంది. ప్రారంభించిన పను-లను సకాలంలో పూర్తి చేస్తారు.
ఆశ్వీయుజంలో స్వయంవృత్తి, ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు ఉద్యో-గాలలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు పై అధికారులతో ప్రయోజనాన్ని పొందుతారు. కార్తీక-మాసంలో స్నేహితులు, బంధువులతో మనస్పర్థలు రావచ్చు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు. ఖర్చులు పెరిగిపోవడం. మార్గశిర మాసంలో మిశ్రమ ఫలితాలు. ఉద్యోగస్తులు ఆఫీసులో అయిష్టతతో పనులు చేయవలసి రావచ్చు. కొత్తవారితో పరిచ-యాలు తద్వారా పనులు నెరవేరుట. కొత్త వస్తువు-లను కొనే అవకాశాలున్నాయి. పౌష్య మాసంలో ప్రధానమెన గ్రహాలు అనానుకూలంగా ఉన్నాయి. పట్టుదల, శ్రమ అవసరం. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి అవడానికి శ్రమించ వలసి ఉంటుంది. వ్యవహారంలో ఆలోచన, లౌక్యంతో ముందుకు వెళ్లాలి. మాఘ మాసంలో ఉద్యోగస్తులు అధికారుల విమర్శలకు గురియగుట. అతి ప్రయా-ణాల మూలంగా అలసట, అనారోగ్యములు. ఫాల్గుణ మాసంలో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో మానసిక ఆందోళనలు ఉండవచ్చు. మాసాంతంలో కొంత తగ్గే అవకాశం ఉంది. రాబడి ఖర్చులకు తగినట్లుగా ఉంటుంది.
– కేశవ
మిగతా రాశులను తెలుసుకోవాలంటే ఈ క్రింది వాటిని క్లిక్ చేయండి..











