RRR MOVIE REVIEW : ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ.. రెచ్చి పోయిన చరణ్, తారక్

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది… ఒక ఆర్.ఆర్. ఆర్ మూవీ మాత్రమే అని చెబుతారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధానపాత్రలలో నటిస్తున్నారు.భారీ బ‌డ్జెట్ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ అనౌన్స్ మెంట్ డే నుంచే .. భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి, ఒలివియా మోరిస్ న‌టించ‌డం కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

కథ ఎంటంటే ?

ఆర్‌ఆర్‌ఆర్‌ కథ పూర్తిగా 1920 లలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నివసించే వారి నేపథ్యంలో సాగుతుంది. రామరాజు, కొమురం భీం ఇద్దరికీ చిన్నతనం నుంచి పోరాడే తత్వం ఉంటుంది. రామరాజు కు పోలీస్ కావాలనీ ఆసక్తి. అందుకు తగ్గట్టుగానే పెరిగి పెద్దయ్యాక నాటి బ్రిటీష్ గవర్నమెంట్ లో పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతాడు రామరాజు. ఇక బీమ్ తన జాతి గౌరవం కోసం.. తన ప్రాణాలు కూడా ఇచ్చే సహస వీరుడు. భీమ్‌ గోండు జాతికి చెందిన ఓ పచ్చబొట్టు పొడిచే పాపను బ్రిటిష్ ఆఫీసర్ భార్య తమతోనే ఉంచుకుందామనీ తీసుకువెళుతుంది. పాప తన తల్లి ని చూడాలని ఆరాటపడుతుంది. అటు తల్లి కూడా తన పాపను చూసుకుందామని ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తోంది. కానీ తల్లి బిడ్డ ను కలవకుండా బ్రిటీష్ సైనికులు, అధికారులు పన్నాగం పన్నుతారు. ఇది తెలిసిన కొమురం భీము ఎలాగైనా తమ గోడు పాపను రక్షించాలని అనుకుంటాడు.

ఇది ఇలా ఉంటే ఓ సందర్భంలో ఇన్స్పెక్టర్ రామరాజు, కొమురం భీం కలుసుకుంటారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య మంచి స్నేహ బంధం బలపడుతుంది. ముస్లిం లాగా కనిపించే భీమ్… చలాకీగా ఉండే రామ్ ఇద్దరూ తమ అసలు లక్షణాలను చెప్పుకోరు. కానీ వారి స్నేహబంధం మాత్రం చెరిగిపోనిది. అయితే.. బ్రిటీష్‌ వారిని ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో.. భీమ్‌ ను బంధించాలని ఆంగ్లేయులు అనుకుంటారు. దీనికోసం రామ రాజు మాత్రమే సరైనోడు అనుకుంటారు.

ఇందులో భాగంగానే… రామరాజును అధికారికగా నియమిస్తారు. అప్పుడే రాజరాజు, భీం ల గురించి ఒకరినొకరు తెలుసుకుంటారు. తననే అరెస్టు చేస్తావా అంటూ భీమ్‌ సీరియస్‌ అవుతాడు. అంతే.. వారి మధ్య వివాదం చెలరేగుతుంది. అయితే.. తమ స్నేహానికి విలువ ఇచ్చి.. భీమ్‌.. రామరాజుకు లొంగిపోతాడు. అయితే.. ఆ తర్వాత.. రామరాజు, భీం ఎలా కలుస్తారు.. బ్రీటీష్‌ వారిని ఎలా ఎదుర్కొంటారు.. అసలు సీతది ఏం పాత్ర అనేది సినిమా చూడాల్సింది. ఈ మూవీ కథ మొత్తం ఓ గోండు బాలిక చుట్టే తిరుగుతుంది.

నటీ-నటుల యాక్టింగ్‌ తీరు

జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తప్ప, మిగతా అందరూ సహాయక పాత్రలు పోషిస్తారు. తారక్‌తో కొన్ని కీలకమైన క్షణాలు మినహా అలియా భట్‌కి ఏమీ లేదు. చరణ్‌కి జోడీగా అలియా భట్ నటిస్తోంది, అయితే ఆమెకు జూనియర్ ఎన్టీఆర్‌తో కీలక సన్నివేశాలు ఉన్నాయి. ఒలివియా మోరిస్ బాగానే ఉంది. ఆమె మొదటి సగంలో ప్రధాన భాగాన్ని కలిగి ఉంది మరియు మొదటి సగంలో సాధారణ వినోదాత్మక విభాగాన్ని పొందుతుంది. అజయ్ దేవగన్ ఫ్లాష్‌బ్యాక్‌లో క్లుప్తంగా కనిపిస్తాడు మరియు ఎప్పటిలాగే బాగానే ఉన్నాడు. సముద్రఖని మంచివాడు అయితే రాహుల్ రామకృష్ణ ఎప్పటిలాగే ఆధారపడదగినవాడు. మిగిలిన వారిలో, అలిసన్ డూడీ మరియు రే స్టీవెన్సన్ బాగానే ఉన్నారు.

పాజిటివ్‌ పాయింట్స్‌

ఎన్టీఆర్‌, చరణ్‌ యాక్టింగ్‌
ఇంటర్వల్‌ సీన్‌
చివరి 30 నిమిషాల సీన్‌
డైరెక్షన్‌

మైనస్‌ పాయింట్స్‌
సెకండాఫ్‌
కథ నిడివి ఎక్కువ కావడం
హీరోల ఎంట్రీ ఆలస్యం కావడం

రేటింగ్ : 3/5

ట్యాగ్ లైన్ :  మరో “రాజన్న”

Read more RELATED
Recommended to you

Latest news