పీఎఫ్ అకౌంట్లు ఉన్న వారికి గుడ్ న్యూస్.. ఉచితంగా ఆ బెనిఫిట్..!

-

పీఎఫ్ అకౌంట్‌కు కంట్రిబ్యూషన్ చేసే ఖాతాదారులకు ఎన్నో లాభాలు వున్నాయి. చాలా మంది పీఎఫ్ అకౌంట్‌కు కంట్రిబ్యూషన్ చేసి లాభాలను పొందుతున్నారు. ఇది ఇలా ఉంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఈపీఎఫ్ వడ్డీ రేట్లను 0.4 శాతం తగ్గించి 8.1 శాతానికి తీసుకొచ్చింది. అయితే ఈ వడ్డీ రేటుని తగ్గించినా ఇతర పొదుపు ఖాతాలతో పోలిస్తే ఈ పీఎఫ్ అకౌంట్ పెట్టుబడులపై వడ్డీ ఎక్కువగా వస్తోంది.

ఇది ఇలా ఉంటే పీఎఫ్ అకౌంట్‌కు కంట్రిబ్యూషన్ చేసే ఖాతాదారులకు ఎన్నో రకాల లాభాలు కూడా ఉంటాయి. పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కింద అకౌంట్ హోల్డర్స్ రూ.7 లక్షల వరకు ఉచిత బీమా పొందొచ్చు.

ఏమైనా ప్రమాదం కనుక కలిగి ఆ పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సురక్షితను అందించేందుకు ఈ పథకాన్ని ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. రూ.7 లక్షల వరకు ఉచిత బీమా పొందొచ్చు. అయితే ఇది వరకు ఇది ఆరు లక్షలు మాత్రమే.

కానీ ఇప్పుడు అయితే దీనిని ఏడు లక్షలు చేసారు. ఇది ఇలా ఉంటే నిర్వహణలో లేని పీఎఫ్ ఖాతాలపై కూడా అకౌంట్ హోల్డర్లు వడ్డీని పొందవచ్చు. అయితే ఒకవేళ మూడేళ్ల కంటే ఎక్కువ కాలం పీఎఫ్ అకౌంట్ ఇన్‌యాక్టివ్ అయినా కూడా వడ్డీ వస్తుంది. అంతకుముందు మూడేళ్ల కాలంలో పీఎఫ్ అకౌంట్ ఇన్‌యాక్టివ్ అయితే వడ్డీ లభించేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం వడ్డీని ఇస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news