RRR: భార్యతో కలిసి భ్రమరాంబ థియేటర్‌లో రామ్ చరణ్..ఆనందంతో ఊగిపోయిన అభిమానులు..

-

‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ఇంకో రెండు గంటల్లో దేశవ్యాప్తంగా సినీ అభిమానులు చూడబోతున్నారు. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. మెగా, నందమూరి అభిమానులు తమ హీరోల కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తున్నారు. సినిమా చూస్తున్న క్రమంలో పేపర్లు విసిరేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా, బెన్ ఫిట్ షోలు చూసిన ప్రేక్షకులు సినిమా సూపర్ హిట్ అని చెప్పేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్ కూకట్ పల్లిలోని భ్రమరాం థియేటర్‌లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చూశారు.

upasana ramcharan
upasana ramcharan

ఈ సందర్భంగా రామ్ చరణ్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. బెన్ ఫిట్‌షోలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని చూసి రామ్ చరణ్ భార్య ఉపాసన ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ తేజ్ – తారక్ మధ్య ఉన్న దోస్తీ వెండితెరపైన అత్యద్భుతంగా ఆవిష్కృతమైందని పేర్కొన్నట్లు టాక్. దాదాపు మూడేళ్ల తర్వాత తమ అభిమాన కథనాయకులను సిల్వర్ స్క్రీన్ పైన చూసేందుకు అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి రూపొందించిన విజ్యువల్ వండర్‌లో తమ హీరోల పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తు్న్నారు.

ఇకపోతే చిత్ర ప్రీమియర్ ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాలో చూసిన అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా బొమ్మ బ్లాక్ బాస్టర్ అని పోస్టులు పెడుతున్నారు. సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు రెడీ అయిపోయారు. మొత్తంగా దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ మేనియా కొనసాగుతుండటం పట్ల సినీ పరిశీలకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది శుభ పరిణామమని, తెలుగు సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తం అయిందని పేర్కొంటున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news