చరణ్ కు బర్త్ డే విషెస్ నాకు వింతగా అనిపిస్తుంది : చిరంజీవి సంచలన పోస్ట్

-

మెగా పవర్‌ స్టార్‌ గా పేరు తెచ్చుకున్న రామ్‌ చరణ్‌… ఈ నాటి నట వారసుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నారు. తండ్రి మెగాస్టార్‌ చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించుకుంటూనే… తనదైన బాణీ పలికిస్తున్నారు రాం చరణ్‌. అటు హీరోగా అలాగే.. నిర్మాతగా రాణిస్తున్నారు. తండ్రి చిరంజీవి.. కమ్‌ బ్యాక్‌ సినిమా ఖైదీ నంబర్‌ 150 తో నిర్మాతగా మారిన రామ్‌ చరణ్‌.. తరువాత తండ్రితోనే సైరా.. నరసింహరెడ్డి, ఆచార్య సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.

ఇక చరణ్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రెండు రోజుల కింద విడుదలై.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇది ఇలా ఉండగా.. ఇవాళ చరణ్‌ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో సెలబ్రీటీలు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇటు చిరంజీవి కూడా చరణ్‌ కు విషెస్‌ చెప్పారు.

చరణ్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పటం వింతంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు చిరంజీవి.”రాంచరణ్ కి సోషల్ మీడియా ద్వారా Birthday Wishes చెప్పటం నాకు వింతగా అనిపిస్తుంది. అయితే ఈ occasion లో రామ్‌ చరణ్‌ పిక్ ఒకటి షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. కొడుకుగా He makes me proud and he is my pride. #HBDRamcharan” అంటూ చిరు ఎమోషన్‌ ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news