వాహనదారులకు షాక్..ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్‌ ట్యాక్స్‌ !

-

వాహనదారులకు మరో దిమ్మ తిరిగే షాక్ తగులనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి టోల్ టాక్స్ అనుసరిస్తూ భారత జాతీయ రహదారుల సంస్థ టోల్ ప్లాజా ల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది. తేలికపాటి వాహనాల సింగిల్ జర్నీ కి టోల్ కాంట్రాక్టర్ నిర్వహిస్తున్న రోడ్డు దూరము, సదుపాయాలను బట్టి.. 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెంచింది.

డబుల్ ఎంట్రీకి కనిష్టంగా 10 రూపాయల చొప్పున పెంచనున్నట్లు ప్రకటన చేసింది. తేలికపాటి గూడ్స్/ బస్సులకు సింగిల్ ఎంట్రీకి కనిష్టంగా 15 రూపాయలు, బస్సులు/ రెండు యాక్సిల్ సుండే ట్రక్కు లకు 25 రూపాయలు, త్రిబుల్ యాక్సిల్ వాహనాలకు 30 రూపాయలు, నాలుగు నుంచి ఆరు యాక్సిల్స్ వాహనాలకు 45 రూపాయలు, అంతకంటే ఎక్కువ యాక్సిల్స్ ఉండే భారీ ట్రక్కులకు  50 రూపాయల చొప్పున టోల్ చార్జీలు పెరిగాయి. ఈ చార్జీలను ఈనెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలు చేయనున్నారు. దీంతో వాహన దారుల పై భారీ గానే భారం పడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news