ఏపీ ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు: సీఎం కేసీఆర్

-

మాకు ఉదార స్వభావం ఉంది. గోదావరిలో 1000 టీఎంసీలు అల్లోకేషన్ ఉంది. అది మాకు చెందాల్సిన నీళ్లు. మాకు రావాల్సినవి బాజాప్తా తీసుకుంటాం. అలాగే.. మేము పోలవరానికి ఎన్నడూ అడ్డం రాలేదు.

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకురావడానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి టీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా మద్దతు ఇస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వికారాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఈసందర్భంగా చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై చేసే అసత్యపు ప్రచారాలను తిప్పి కొట్టారు. చంద్రబాబు అన్ని అబద్ధాలు ఆడుతున్నారని ఎండగట్టారు.

telangana govt supports polavaram project and ap special status

చంద్రబాబు నాయుడు రెండు విషయాలను సభా వేదికగా కుండ బద్ధలు కొట్టినట్టు చెబుతున్నా. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేశవరావు అనేకసార్లు రాజ్యసభలో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో మాట్లాడారు. నాకు ఉన్న సమాచారం ప్రకారం టీఆర్ఎస్ కు 16 ఎంపీ సీట్లు, ఎంఐఎంకు ఒక సీటు, ఏపీలో జగన్ మోహన్ రెడ్డికి వచ్చే సీట్లన్నీ కలిపితే 35 నుంచి 36 దాకా వస్తాయి. ఖచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి తెలంగాణ ఎంపీలు మద్దతు ఇస్తారు. టీఆర్ఎస్ కూడా ప్రత్యేక హోదాకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది. మేము పక్కన ఉన్నవాళ్లు బాగుండాలి అని కోరుకునే వాళ్లమే తప్పితే.. నీలాగ సన్నాసిలాగా చెడిపోవాలని కోరుకునే వాళ్లం కాదు. తెలంగాణ వాళ్లకు అటువంటి గుణం లేదు. నీ అటువంటి దరిద్రపు బుద్ధి మాకు అస్సలు లేదు.

మాకు ఉదార స్వభావం ఉంది. గోదావరిలో 1000 టీఎంసీలు అల్లోకేషన్ ఉంది. అది మాకు చెందాల్సిన నీళ్లు. మాకు రావాల్సినవి బాజాప్తా తీసుకుంటాం. అలాగే.. మేము పోలవరానికి ఎన్నడూ అడ్డం రాలేదు. పోలవరం ప్రాజెక్టుకు సంపూర్ణ మద్దతు ఇస్తాం. ఈ సంవత్సరం కూడా తెలంగాణ, ఆంధ్రా వాడిన తర్వాత కూడా 2600 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయి. సముద్రంలో కలవడం కన్నా మీరు వాడుకుంటే ఆంధ్రా సస్యశ్యామలం అవుతుంది.. ఆంధ్రా ప్రజలంతా మంచి వాళ్లు. వాళ్లతోని ఏ పంచాయతీ లేదు. కేవలం నీలాంటి ఓ పది మందితోనే కిరికిరి ఉన్నది చంద్రబాబు.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news