మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్ : మ‌రోసారి త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. వ‌రుస‌గా మూడో రోజు

-

బంగారం కొనుగోలు దారుల‌కు గుడ్ న్యూస్. నేడు బంగారం ధ‌ర‌లు మ‌రోసారి త‌గ్గాయి. నేటితో మూడోవ రోజు బంగారం ధ‌ర‌లు త‌గ్గాయి. ఈ రోజు ప‌ది గ్రాముల‌ బంగారంపై 22 క్యారెట్ల బంగారంపై రూ. 100, 24 క్యారెట్ల పై రూ. 120 త‌గ్గింది. కాగ ఇంత‌కు ముందు వ‌రుస‌గా రెండు రోజుల పాటు రూ. 210, రూ. 280 వ‌ర‌కు బంగారం ధ‌ర‌లు త‌గ్గాయి. ఈ మూడు రోజుల్లో రూ. 610 వ‌ర‌కు ప‌ది గ్రాముల బంగారంపై త‌గ్గింది. దీంతో బంగారం ధ‌ర రూ. 52 వేల దిగువ కు చేరింది.

అలాగే వెండి ధ‌రలు నేడు నిల‌క‌డ‌గా ఉన్నాయి. గ‌త రెండు రోజుల నుంచి త‌గ్గుతున్న వెండి ధ‌ర‌లు నేడు ఎలాంటి మార్పులు లేకుండా ఉంది. కాగ గ‌త రెండు రోజుల్లో వెండి ధ‌ర రూ. 1,300 వ‌ర‌కు త‌గ్గింది. దీంతో వెండి ధ‌ర రూ. 72 వేల వ‌ర‌కు వ‌చ్చింది. త‌గ్గిన ధ‌ర‌లతో బంగారం, వెండి ధ‌రలు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్, విజ‌యవా న‌గ‌రాల్లో 10 గ్రాముల బంగారంలో… 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 47,650 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 51,980 గా ఉంది.
కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 72,100 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news