ఉగాది పచ్చడిలో వేపపూత కలిపి నిరభ్యంతరంగా తినొచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వేప చెట్టుకు వచ్చిన తెగులు తాత్కాలికమని, అది వేపపూతలో ఏమీ లేదని తెలిపారు.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ ప్రాంత అడవుల నుచి వ్యాపించిన వైరస్ వల్ల వేప చెట్లకు తెగులు సోకి చాలా ప్రాంతాల్లో ఎండిపోయాయి. కానీ, మళ్లీ చాలా చెట్లకు పూర్తిస్థాయిలో చిగురు, పూత వచ్చాయి. ఈ పూతను తినడం ఆరోగ్యానికి మంచిదేనా కాదా అనే సందేహం చాలా మందిని వేధిస్తోంది. అయితే, అలాంటి అనుమానాలు ఏమి అవసరం లేదని, ఉగాది పచ్చడిలో నిరభ్యంతరంగా వేప పూతను తినొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.