స‌జ్జ‌ల స్పీక్స్ : భారం ప‌దివేల కోట్లు..పెంపు 1400 కోట్లు మాత్ర‌మే ?

-

విద్యుత్ ఛార్జీల పెంపుపై అంత‌టా నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్న వేళ ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాద‌న మ‌రో విధంగా ఉంది. స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి ఇవాళ ప్రెస్మీట్ నిర్వ‌హించి కొన్ని విష‌యాలు వివ‌రించారు. ఆయ‌నేం అన్నారంటే.. విద్యుత్ శాఖకు సంబంధించి ఏటా దాదాపు రూ.10 వేల కోట్ల భారం పడుతోంది. క‌నుక దీన్ని తగ్గించడంపైనా దృష్టి పెట్టాం.

అంతేతప్ప, ఏకపక్షంగా ఛార్జీలు పెంచాలని యోచించలేదు. వ్యవసాయానికి దీర్ఘకాలం విద్యుత్‌ తక్కువ ఖర్చుకే సరఫరా చేసేలా సౌర విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాం.ఇవాళ్టికి కూడా 30 యూనిట్లు, 50 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగదారులపై వేస్తున్న ఛార్జీ దేశంలోనే చాలా తక్కువ. ఇది వాస్తవం. అని చెప్పారాయ‌న.

ఇక ఆ రోజు జ‌రిగిన పీపీఏల గురించి మాట్లాడుతూ..

నిజానికి ఆనాడు అవసరం లేకపోయినా ఎక్కువ ధరకు చంద్రబాబు పీపీఏలు చేసుకున్నారు. అందుకే ఈ ప్రభుత్వం వాటిని సమీక్షించాల్సి వచ్చింది. 2004కు ముందు కూడా చంద్రబాబు అదే విధంగా పీపీఏలు చేసుకున్నారు. ఆ తర్వాత 2014 తర్వాత కూడా సరిగ్గా అలాగే చేశారు. కానీ ఈ ప్రభుత్వం ప్రతి చోటా విద్యుత్‌ ధర తగ్గించడానికి ప్రయత్నిస్తోంది.

అదే విధంగా రైతులకు నాణ్యమైన విద్యుత్‌ ఏ మాత్రం ఆటంకం లేకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. అందుకే సౌర విద్యుత్‌ ఉత్పత్తికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోసారి చెబుతున్నాం. నెలకు 100 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగించే వారిపై వేస్తున్న భారం ఇవాళ్టికీ మన దగ్గరే చాలా తక్కువగా ఉంది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే, ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యతగా వ్యవహరిస్తోంది..అని అన్నారాయ‌న.

Read more RELATED
Recommended to you

Latest news