ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాం చోటుచేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌కు ఆయన బాబాయ్ ప్రగతిశీళ్ సమాజ్‌వాదీ(లోహియా) పార్టీ అధ్యక్షుడు శివ్‌పాల్‌సింగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఎస్పీ కూటమి నుంచి బయటకు వచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో శివ్‌పాల్ యాదవ్ భేటీ అయ్యారు. దీంతో ఆయన బీజేపీతో కలిసి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో కలసి శివ్‌పాల్ యాదవ్ పార్టీ పోటీ చేసింది. అయితే, కొత్త ఎంపికైన ఎస్పీ ఎమ్మెల్యేలు గత నెల 26న భేటీ కాగా, ఆ సమావేశానికి శివ్‌పాల్ యాదవ్‌ను అఖిలేశ్ యాదవ్ ఆహ్వానించలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రం కావడంతో బీజేపీ వైపుకు శివ్‌పాల్ యాదవ్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.