బీజేపీ రాజకీయాల్లో టీడీపీ చొచ్చుకుపోయింది అని అనేందుకు అప్పట్లో కొందరు ఎంపీలు వెళ్లడమే తార్కాణం. వారితో పాటు చంద్రబాబు సలహాతోనే అప్పట్లో సంచలనం అయిన ఓ మహిళా నాయకురాలు కూడా బీజేపీ గూటికే వెళ్లిపోయారు. మనిషి అక్కడ ఉన్నా కూడా పాపం మనసు మాత్రం టీడీపీలోనే ఉండిపోయింది కానీ ఎన్టీఆర్ జయంతికి మాత్రం నిన్నటి వేళ పార్లమెంట్ సెంట్రల్ హాల్ దగ్గర ఉన్న విగ్రహం దగ్గరకు వెళ్లి దండేసి దండం పెట్టలేకపోయారు. అది సుజనా అంటే! ఏం లేదు ఆయన అవసరం చంద్రబాబుతో కానీ ఎన్టీఆర్ తో కాదు కదా! ఆ విధంగా ఆయన తన చాతుర్యం చాటుకున్నారు. మిక్కిలి ప్రేమ మరియు విశ్వాసం చాటుకున్న నేతగా పార్లమెంట్ సాక్షిగా తనని తాను మరో మారు ఆవిష్కరించుకుని ఆనందభరితులయ్యారు. ఏదేమయినా ప్రేమంటే ఇదేరా!
రాజకీయాల్లో ప్రేమలు వేరుగా ఉంటాయి.అభిమానాలు ఇంకా వేరుగా ఉంటాయి. ఎవ్వరు ఏమనుకున్నా కూడా తాత్కాలిక ప్రేమలు వేరుగా ఉంటాయి. శాశ్వత అభిమానాలు కూడా వేరుగానే ఉంటాయి. ఉండాలి కూడా! ఎప్పటి నుంచో టీడీపీ లాబీయిస్టులుగా పేరున్న సుజనా పేరుతో పాటు సీఎం రమేశ్ పేరు కూడా బీజేపీలో స్థిరం అయి ఉంది.ఇవాళ సుజనా రిటైర్మెంట్ కు దగ్గరకు వచ్చారు. అంటే ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగియనుంది.ఈ సందర్భంగా చంద్రబాబుపై తన ప్రేమ కుమ్మరించారు.
టీడీపీ, బీజేపీ బంధాలకు తిరుగేలేదు అని మరో మారు నిరూపించారు సుజనా చౌదరి.ఇవాళ రాజ్య సభలో ఆయన మాట్లాడారు. జూన్ లో రిటైర్ అవుతున్న ఎంపీలలో ఆయన కూడా ఉన్నారు. దీంతో ఆయనతో సహా పలువురి వీడ్కోలు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా తన ఎదుగుదలకు కారణం అయిన చంద్రబాబుకు సుజనా చౌదరి ధన్యవాదాలు తెలిపారు. ఒకటి కాదు రెండు పర్యాయాలు తాను ఎంపీ అయ్యేందుకు అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా గతంలో సుజనా తో సహా సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ లాంటి వారంతా బాబు సలహా మేరకే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే !