సీతలో పాయల్ ఐటం సాంగ్.. ఆరెక్స్ భామ అదరగొట్టింది..!

-

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్ గా చేస్తున్న సినిమా సీత. తేజ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ స్పెషల్ ఐటం సాంగ్ చేసింది. బుల్ రెడ్డి అంటూ వచ్చే ఈ సాంగ్ లో పాయల్ అందాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆరెక్స్ 100 సినిమాతో దుమ్ముదులిపేసిన పాయల్ మరోసారి ఈ స్పెషల్ సాంగ్ తో అదరగొడుతుందని చెప్పొచ్చు.

ముఖ్యంగా పాయల్ ఊపు ఆటైనా పాటైనా తాను చేస్తే ఇక డ్యాన్స్ ఫ్లోర్ అదిరిపోవాల్సిందే.. కుర్రాళ్ల మనసు కొల్లగొట్టాల్సిందే అన్నట్టుగా ఉంది. ఇదే కాకుండా వెంకీమామ సినిమాలో వెంకటేష్ సరసన ఛాన్స్ కొట్టేసింది పాయల్ రాజ్ పుత్. ఆరెక్స్ 100 లాంటి ఒక్క సినిమాతోనే అమ్మడు ఈ రేంజ్ అవకాశాలు అందుకుంది అంటే ఇక రానున్న రోజుల్లో పాయల్ జోరుకి మిగతా హీరోయిన్స్ కు కష్టకాలమే అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news