ukraine crisis: మరోసారి ఉక్రెయిన్ కు అమెరికా భారీ సాయం

-

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై నెల రోజులు గడిచిపోయాయి. ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుంటే… మరోవైపు భారీగా దాడులు ఇరువైపులా జరుగుతున్నాయి. ఇటీవల ఇస్తాంబుల్ వేదికగా జరిగిన చర్చల్లో కాస్త పురోగతి కనిపించింది. కీవ్, చెర్నీవ్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటామని రష్యా తెలిపింది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ దళాలు రష్యా సరిహద్దుల్లోని ఆయిల్ డిపోను పేల్చేశాయి. దీంతో మరింగా ఉద్రిక్తతలు పెరిగాయి. 

యుద్ధం ప్రారంభంలో కేవలం మూడు నాలుగు రోజుల్లోనే బలమైన రష్యా ముందు ఉక్రెయిన్ లొంగిపోతుందని అనుకున్నా… పశ్చిమ దేశాల సహాయ సహకారాలతో రష్యన్ ఆర్మీని ఉక్రెయిన్ సేనలు నిలువరిస్తున్నాయి. రాజధాని కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయితే అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు ఉక్రెయిన్ కు ఆర్థికంగా సైనిక పరంగా సహాయసహకారాలు అందిస్తున్నాయి. అమెరికా ఉక్రెయిన్ కు భారీ ఎత్తున సాయం చేస్తోంది. రష్యా దాడులు ప్రారంభం అయినప్పటి నుంచి 1.6 బిలియన్ డాలర్ల సాయాన్ని ఉక్రెయిన్ కు ప్రకటించింది. తాజాగా 300 మిలియన్ డాలర్లను అదనపు సాయం అందించాలని  అమెరికా నిర్ణయించింది. తాజాగా ప్రకటించిన సాయంలో లేజర్ గైడెడ్ రాకెట్ సిస్టమ్, డ్రోన్ లు, మందుగుండు సామాగ్రి, నైట్ విజన్ పరికరాలు, వ్యూహాత్మక సురక్షిత సమాచార వ్యవస్థ, వైద్య సామాగ్రి అందించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news