రికార్డులు బ‌ద్దలు కొడుతున్న పెట్రోల్.. రూ. 120 నాటౌట్

-

పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఆల్ టైమ్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతున్నాయి. గ‌త కొద్ది రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు వ‌రుస‌గా పెరుగుతున్నాయి. దీంతో గ‌తంలో ఎప్పుడు లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు గ‌రిష్ట స్థాయికి చేరుతున్నాయి. ఈ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధ‌రలు మ‌రోసారి పెరిగాయి. గ‌త 15 రోజుల్లో 13 సార్లు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. ఈ రోజు లీట‌ర్ పెట్రోల్ పై 91 పైస‌లు, లీట‌ర్ డీజిల్ పై 87 పైస‌ల చొప్పున పెరిగాయి.

దీంతో సామాన్యుల‌కు అంద‌ని స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఉన్నాయి. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర ఏకంగా.. రూ. 120 మార్క్ ను అందుకుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో రూ. 118. 59 కు చేరింది. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతో వాహానాల వినియోగం కూడా త‌గ్గుతుంది. కాగ నేటి ధ‌ర‌ల పెరుగుద‌ల తో దేశంలో ప‌లు ప్ర‌ధాన నర‌గాల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

తెలంగాణ‌లోని హైద‌రాబాద్ లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 118.59, డీజిల్ ధ‌ర రూ. 104.62 కు చేరింది.
ఏపీలోని గుంటూరు లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 120.45, డీజిల్ ధ‌ర రూ. 106.16 కు చేరింది.
దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 104.61, డీజిల్ ధ‌ర రూ. 95.87 కు చేరింది.
ముంబై న‌గ‌రంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 119.67, డీజిల్ ధ‌ర రూ. 103.92 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news