ఖుష్బూని అక్కడ టచ్ చేశాడు.. చెంప పగలగొట్టింది..! వీడియో

-

సిని నటి ఖుష్బూకి ఓ వింత అనుభవం ఎదురైంది. బెంగళూరు సెంట్రల్ కాంగ్రెస్ అభ్యర్ధి రిజ్వాన్ కు సపోర్ట్ గా ప్రచారంలో పాల్గొన్న ఆమెను ఓ వ్యక్తి గుంపులో వచ్చి ఆమె ప్రైవేట్ పార్ట్ టచ్ చేయాలని చూశాడు. అయితే వెంటనే ఆమె అది గుర్తించి ఆ వ్యక్తిని పట్టుకుని చెంప చెళ్లుమనిపించింది. సీనియర్ నటి ఖుష్బూ ఈ విషయంపై వెంటనే స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యపరచింది.

హీరోయిన్స్ పబ్లిక్ మీటింగ్స్ కు రావాలంటే ఇలాంటి సంఘటనలు జరుగాయన్న భయమే వారిని వెనుకడుగు వేసేలా చేస్తుంది. చుట్టూ ఎంతమంది బౌన్సర్స్ ఉన్నా కొంతమంది ఆకతాయిలు హీరోయిన్స్ ను టచ్ చేయాలని చూస్తారు. అయితే వారు కనీసం టచ్ చేయాలని అనుకుంటారు కాని హడావిడిలో వారికి ఎక్కడో టచ్ అవుతాయి. అయితే కావాలని చేసినా అలా జరిగినా తప్పు తప్పే. ఖుష్బూ రియాక్షన్ అదిరిపోయింది.. ఆ వ్యక్తిని కాలర్ పట్టుకుని మరి చెంప చెళ్లుమనిపించిన తీరు అద్భుతం. ఇంకోసారి ఇలాంటి పనులు ఎవరూ చేయడానికి కూడా సాహసించరనేలా ఖుష్బూ అతనికి బుద్ధి చెప్పింది.



Read more RELATED
Recommended to you

Latest news