ఎడిట్ నోట్ : కృష్ణ కృష్ణా బూతుల మంత్రి సేఫ్ !

-

ఆంధ్రావ‌నిలో విభిన్న ధోర‌ణుల్లో మంత్రులు ఉన్నారు. వారంతా ఇప్పుడు ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయ‌నున్నారు. కొద్దిసేప‌ట్లో ప‌దవులు పోయిన వారు క‌న్నీటిప‌ర్యంతం కాబోతున్నారు. ఆల్రెడీ చాలా మంది ఏడుపు ముఖాల‌తో ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు కూడా ! ముఖ్యంగా ముఖ్య‌మంత్రి తీరు ఎలా ఉన్నా కూడా మీడియా ముందుకు ఎక్కువ సార్లు వ‌చ్చిన కొంద‌మంది వివాదాస్ప‌ద మంత్రుల కార‌ణంగా జ‌గ‌న్ ప‌రువు పోయింది అని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు.

 

ఎందుకంటే వాళ్ల భాష‌కు సంబంధించి ఎన్నో సార్లు మీడియా ప్ర‌శ్నించినా మార్పు రాలేదు. ఎన్నో సార్లు వ‌ద్ద‌ని వారించినా కూడా వారు విన‌లేదు. కేవ‌లం జ‌గ‌న్ ను ఇంప్రెస్ చేయడం కోస‌మేనా ఇదంతా అని కూడా ఆలోచిస్తే ఆరాతీస్తే అవును అన్న సమాధాన‌మే విన‌ప‌డుతోంది. తాజాగా మాజీలు కాబోతున్న వారిలో అంతా కూడా వీర విధేయులుగా పేరున్న వారే అయినా కూడా ముందు నిర్ణ‌యించిన ప్ర‌కారం వీరిని త‌ప్పించి కొత్త వారిని తీసుకోబోతున్నారు జ‌గ‌న్. ఆ విధంగా వీరి ప‌ద‌వి కాలం ముగిశాక జిల్లాల‌కు పంపి పార్టీ ప‌నులు అప్ప‌గించ‌నున్నారు. పార్టీ ప‌నులు కొంద‌రు తీసుకున్నాక ముఖ్య‌మంత్రి వారితో క‌లిసి ప‌నిచేశాక అప్పుడు ఫ‌లితాలు ఎలా ఉండ‌నున్నాయో తేల‌నుంది.

కేవ‌లం చంద్ర‌బాబు నాయుడిని తిడితేనే మంచి జ‌రుగుతుంది అని అనుకోవ‌డం అవివేకం అని కూడా తేలిపోయింది. ఆ లెక్క‌న వైసీపీలో ఉన్న‌వాళ్లంతా తెల్లారితే చాలు చంద్ర‌బాబును, లోకేశ్ బాబును తిడుతూనే ఉంటారు.మ‌రి! వాళ్లంద‌రికీ ప‌ద‌వులు రావాలే ! ఎందుక‌ని రావ‌డం లేదు. ఏదేమ‌యినా ఇటువంటి సంస్కృతి మంచిది కాదు. ఆఖ‌రికి వెళ్తూ వెళ్తూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ మ‌ళ్లీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు కొన్ని టీడీపీ లీడ‌ర్ బుద్దా వెంక‌న్న‌ను ఉద్దేశించి చేశారు.

 

మంత్రి వ‌ర్గ విస్త‌రణ‌తో కొత్త ముఖాలు రానున్నాయి. దాస‌న్న కానీ బొత్స కానీ మ‌ళ్లీ మ‌ళ్లీ చోటు ద‌క్కించుకోరు. ఇదే స‌మ‌యంలో మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఏంటంటే ఉమ్మ‌డి కృష్ణా జిల్లాకు చెందిన గుడివాడ ఎమ్మెల్యే, పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి  కొడాలి నాని ని మాత్రం కొన‌సాగిస్తారు. ఇదే ఇప్పుడు పెద్ద ఆస‌క్తిదాయ‌క ప‌రిణామం. చంద్ర‌బాబును ఢీ కొనేందుకు ఆయ‌న‌ను నోటికి వ‌చ్చిన విధంగా తిట్టేందుకు మ‌ళ్లీ మ‌ళ్లీ ఆయ‌నపై వాగ్బాణాలు సంధించేందుకు, విచ‌క్ష‌ణా ర‌హిత స్థితిలో ఉంటూ భాషను ఉప‌యోగించేందుకు మ‌రో అవ‌కాశం ఆయ‌న‌కు ద‌క్కింది. ఎప్పుడూ బూతులు తిడుతూ వార్త‌ల్లో నిలిచే మంత్రికి భ‌లే ఛాన్స్.
ఈ పాటి తిట్లు ఎవ్వ‌రైనా తిట్ట‌గ‌ల‌రు కానీ మంత్రి ఇదికాకుండా నియోజ‌క‌వ‌ర్గానికి కానీ రాష్ట్రానికి కానీ చేసిందేంటో చెప్పాల‌ని
టీడీపీ స‌వాలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news