మేమేమైనా పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చామా..? టీఆర్ఎస్ ఓ నీతి మాకో నీతా..?: ప్రభుత్వం తీరుపై రేవంత్ రెడ్డి

-

టీఆర్ఎస్ పార్టీ రోడ్లపైన, జాతీయ రహదారులపై టెంట్లు వేసి మీడియాకు ఫోజులు ఇస్తే పోలీసులకు మాత్రం ఇది ఎక్కడ కనిపించలేదని… ప్రజల తరుపున మేం నిరసన తెలుపుదాం అంటే కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారని విమర్శించారు. మేమేమైనా పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చామా…? అంటూ ప్రశ్నించారు. మేం ప్రజాప్రతినిధులం ప్రజల తరుపున పోరాడుతున్నామని… ప్రజాస్వామ్యంలో నిరసన ఓ భాగం అని ఆయన  అన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొంట లేదని అంటున్న కేసీఆర్.. వడ్లు కొనాలని కాంగ్రెస్ రైతులకు అండగా నిలబడాలని భావిస్తే కేసీఆర్ ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఎందుకు మమ్మల్ని హౌజ్ అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. డ్రగ్స్ వ్యతిరేఖంగా కొట్లాడిన, గ్యాస్, విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు నిరసన తెలిపినా… పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ రహదారులపై నిరసన తెలిపితే.. మీకు ఎలాంటి నిబంధనలు వర్తించవా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, మోదీ ఒక్కటే అని… రాష్ట్ర, దేశ ప్రజల్ని దోచుకుంటున్నారని విమర్శించార. మిల్లర్లకు, దళారులకు వడ్లను తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందిని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు మిల్లర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వస్తున్నాయని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news