ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని భావించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్ దుకాణాల్లో లబ్దిదారులు బియ్యం వద్దనుకుంటే.. డబ్బులు ఇచ్చే నగదు బదిలీ పథకానికి శ్రీకారం చుట్టడానికి సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. వచ్చే నెల నుంచే ఈ నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పథకాన్ని తీసుకురావాలని ప్రయత్నించారు.
కానీ చంద్రబాబు హయంలో నగదు బదిలీ పథకం తీసుకురావడం సాధ్యం కాలేదు. కానీ నేటి వైఎస్ జగన్ ప్రభుత్వం నగదు బదిలీ పథకం అమలు కోసం అడుగులు వేస్తుంది. దీనిపై మంత్రి వర్గ ఉప సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. ఈ నగదు బదిలీ పథకం పైలట్ ప్రాజెక్ట్ కింద అనకాపల్లీ, నంద్యాల, కాకినాడ, నర్సాపురం, గాజువాకలను ఎంచుకొని అమలు చేయనున్నారు. రేషన్ దుకాణాల్లో బియ్యం వద్దు అనుకునే లబ్ధిదారులకు.. కిలో బియ్యానికి రూ. 12 నుంచి 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే అవకాశం ఉంది.