అల్లు శిరీష్ ABCD ట్రైలర్.. అల్లు హీరో అదరగొట్టాడు..!

-

అల్లు శిరీష్ హీరోగా రుక్షర్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఏబిసిడి (అమెరికన్ బార్న్ కన్ ఫ్యూజెడ్ దేశీ). సంజీవ్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. ఈ ట్రైలర్ చూస్తే సినిమా కథ దాదాపు అర్ధమైందని చెప్పొచ్చు. అమెరికాలో పుట్టి పెరిగిన హీరో కొన్ని కారణాల వల్ల ఇండియాకు వస్తాడు. అక్కడ హీరోయిన్ ను చూసి ఇష్టపడతాడు.

ఇక ఇండియాలో హీరో ఎంత ఇబ్బంది పడ్డాడు.. సడెన్ గా పొలిటికల్ చక్రంలో ఇరుక్కున్న హీరో ఫైనల్ గా ఏం చేశాడు అన్నది సినిమా కథ. బిజినెస్ మెన్ గా నాగబాబు నటిస్తున్నాడు. ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం ఆద్యంతం సరదాగా సాగుతుందని తెలుస్తుంది. మాస్టర్ భరత్ ఈ సినిమాలో హీరో స్నేహితుడిగా నటిస్తున్నాడు. మొత్తానికి అల్లు శిరీష్ ఏబిసిడి మ్యాజిక్ చేసేలా ఉన్నారు. మే 1 రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాతో అల్లు హీరో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news