సెమికండక్టర్ షార్టేజ్…. ఇండియాలో అత్యధిక వేయిటింగ్ పిరియడ్ ఉన్న కార్లు ఇవే…

-

సెమికండక్టర్ల కొరత ప్రభావం ఆటోమోబైల్ పరిశ్రమపై పడుతోంది. ముఖ్యంగా కార్ కొందాం అనుకుంటున్న వినియోగదారుడికి నెలలు గడిస్తే తప్పితే.. కార్ రావడం లేదు. ఇటీవల కాలంలో ఎయూవీ కార్ల కొనుగోలు ఇండియాలో పెరిగింది. అయితే కార్లలో అందిస్తున్న అధునాతన ఫీచర్లకు, సెన్సార్లకు సెమికండక్టర్ చిప్ లు అవసరం. అయితే వీటి కొరత వలన కార్ల వేయిటింగ్ పిరియడ్ పెరుగుతోంది. 

మహీంద్రా, స్కోడా, హ్యుందాయ్, టాటా ఇలా అన్ని కార్ల కంపెనీలను చిప్ సెట్ల కొరత వేధిస్తోంది. ఇండియాలో ఎక్కువ వెయిటింగ్ పిరియడ్ ఉన్న కార్లను పరిశీలిస్తే… మహీంద్రా ఎక్స్ యూ వీ 700కి అత్యధికంగా 21 నెలల వేయిటింగ్ ఉంది. మహీంద్రా థార్ కార్ కు కూడా ఇప్పుడు బుక్ చేసుకుంటే 11 నెలల వరకు కానీ కార్ రాని పరిస్థితి ఏర్పడింది. కియా సోనెట్ కు 4 నుంచి 7 నెలలు, హ్యుందాయ్ క్రేటాలో డిజిల్ వెర్షన్ కు 5 నెలలు, పెట్రోల్ వేరియంట్ కు 7 నెలల వెయిటింగ్ పిరియడ్ ఉంది. టాటా నెక్సాన్  పెట్రోల్, డిజిల్ వేరియంట్ కు 5 నెలలు, నెక్సాన్ ఎలక్ట్రిక్ మోడల్ కు 4 నెలల వెయిటింగ్ పిరియడ్ ఉంది. కియా సెల్టాస్ వేరియంట్ ను బట్టి 5 నెలలు, టాటా పంచ్ కార్ కు 4 నుంచి 9 నెలల, టోయోటా ఫార్చూనర్ 4 నెలల వరకు, ఎంజీ ఆస్టర్, నిస్సాన్ మాగ్నైట్ కార్లకు కూడా నెలల వెయిటింగ్ పిరియడ్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news