మహిళలలో కోసం మన తిరుపతిలో పింక్ ఆటోలు.. ఏ టైంలోనైనా టెన్షన్ అక్కర్లా

-

రాత్రిపూట ఆటోలో ప్రయాణం అంటే లేడీస్ కచ్చితంగా భయపడతారు. పక్కన ఎవరైన అన్నో, తమ్ముడో, ఫ్రెండో ఇలా ఎవరైనా బాయ్స్ ఉంటే భయం ఉండదు కానీ.. ఇద్దరూ అమ్మాయిలే అయితే ఆటోలు ఎక్కడానికి ఆలోచిస్తారు. రోజులు అలా ఉన్నాయి మరీ. ఏ సమయంలో అయినా మేం ఉన్నా అని భరోసా ఇస్తున్నారు తిరుపతిలోని ఆటో మహిళలు. అవునండీ.. తిరుపతిలో పింక్ ఆటోలు ఉన్నాయి. వీటిని లేడీస్ డ్రైవ్ చేస్తారు.

మహిళల ప్రయాణ సౌలభ్యం కోసం ప్రత్యేకంగా పింక్ ఆటోలు ఏర్పాటు చేశారు. వెంకన్న దర్శనానికే కాకుండా ఆసుపత్రుల్లో చికిత్సల కోసం, విద్యాలయాల్లో చదువుకునే పిల్లలు, వారి కుటుంబ సభ్యులు చాలా ప్రాంతాల నుంచి రోజూ వేల సంఖ్యలో తిరుపతికి వస్తుంటారు. చాలా సార్లు.. తెల్లవారుజామున, అర్థరాత్రుల్లో ట్రైన్ దిగుతుంటారు.. ఆ టైంలో యూనివర్శిటీకి వెళ్లాలంటే కాస్త భయంగానే ఉంటుంది. ఇంకా ఒక్కరే ఉంటే చాలా టెన్షన్ అనిపిస్తుంది. ఇలాంటి ఎంతో మంది భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ పింక్‌ ఆటో సర్వీసులను ప్రారంభించారు.

రాస్‌ స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహకారంతో 350 మంది మహిళలు ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ పొందారు. వారిలో 150 మంది మహిళలు తిరుపతిలో ఆటోలు నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. ‘రాత్రి వేళ ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలు పలు సందర్భాల్లో…. డ్రైవర్లతో ఇబ్బంది పడి పోలీస్‌ కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసేవారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. కొందరికి ఇలా కాల్‌ చేసే అవకాశమూ ఉండకపోవచ్చు. అందుకే ప్రత్యేకంగా ఈ గులాబీ రంగు ఆటోలను అందుబాటులోకి తెచ్చామని తిరుపతి అర్పన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు అంటున్నారు.. ఇంకా.. మగ డ్రైవర్లతో పాటు ఒకే స్టాండులో ఉండటం మహిళా ఢ్రైవర్లకు, ప్రయాణికులకూ అసౌకర్యంగా ఉండటాన్ని గమనించి ప్రత్యేక స్టాండులనూ ఏర్పాటు చేశామంటున్నారు ఎస్పీ.

ఏ సమయంలో అయినా ఈ షీ ఆటోస్టాండుకి వెళ్తే చాలు. అక్కడి మహిళా డ్రైవర్లు సురక్షితంగా గమ్యానికి చేరుస్తారు. నగర బస్టాండ్‌, రుయా ఆసుపత్రి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రాంతాల్లో ఈ స్టాండులను మీరు చూడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news